జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే పగడ్బందీగా నిర్వహించాలి

జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే పగడ్బందీగా నిర్వహించాలి

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

(కౌడిపల్లి మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )

కౌడిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తనిఖీ

జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే పగడ్బందీగా నిర్వహించాలి

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. కౌడిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తనిఖీ కౌడిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడుతున్నట్లయితే తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రోగులకు సూచించారు. ఆదివారం కౌడిపల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ఏఎన్ సీ, ఇన్ పేషెంట్ ,మందుల స్టాక్ రిజిస్టర్ ,తదితర రిజిస్టర్ లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వేను నిర్వహించడం జరుగుతున్నదని, అయితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని, ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను జ్వరం వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ప్రత్యేకించి 3 రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ తో చూయించుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులతో పాటు, అన్ని రకాల జబ్బులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక అవసరమైన మందులు సైతం సిద్ధంగా ఉన్నాయని, అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు వారి పరిధిలో ఎప్పటికప్పుడు జ్వరపీడితులను గమనిస్తూ ఉండాలని, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుండి సమాచారాన్ని సేకరించి వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని, ఇందుకు గాను మందులతో పాటు, ఇతర పరీక్షలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కౌడిపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి,నాణ్యత ప్రమాణాలతో సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఇ ఈ టీజీమిడీఐసీ ని ఆదేశించారు.  కౌడిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తనిఖీ చేసి, వంటగది, నిల్వ గది నిర్వహణ, శుభ్రత మరియు త్వరగా పాడైపోయే వస్తువుల నాణ్యత మొదలైన వాటిని తనిఖీ చేశారు. నాణ్యమైన మేనూఅందించడంతోపాటు గుణాత్మక విద్య బోధించాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!