గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా..
 
 
(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )
ఆదివారం సాయంత్రం గజ్వేల్ మండలం లోని అహ్మదీపూర్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్, ఫార్మా రిజిస్టర్ అన్ని వెరిఫై చేశారు. ఓపి కౌంట్, ఫార్మా కౌంట్, మెడికల్ ఆఫీసర్ కౌంట్ మ్యాచ్ కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ రిజిస్టర్ రాయడం లో కొన్ని సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. సీజనల్ వ్యాధులు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. రాత్రి వేళలో భోజన ప్రక్రియను పరిశీలిస్తూ కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి తెలిపారు. నాణ్యమైన ఆహారపదార్థాలు వాడుతూ రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటలు బాగా ఆడాలని వ్యాయామం చేయాలని పోషకాహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని డైట్ మెనూ లో భాగంగా మిల్లెట్స్ పుడ్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గురుకులంలో ఎలాంటి సమస్యలున్న ప్రాధాన్యత ప్రకారం తప్పనిసరిగా పరిష్కరిస్తానని బాగా చదువుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరాలని తెలిపారు.


