బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న టి. రమేష్

కుత్బుల్లాపూర్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో అందించే ప్రతిభ పురాస్కారాలలో సోషల్ సర్వీస్ విభాగంలో బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ టి రమేష్ కు లభించింది.ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మానేపల్లి జ్యువెలర్స్ అధినేత, స్వర్ణగిరి దేవాలయము వ్యవస్థాపకుడు అయినా మానేపల్లి రామారావు మరియు తెలంగాణ ఆర్య వైశ్య ఫెడరేషన్ ఛైర్మెన్ కల్వ సుజాత తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు ఈ అవార్డు ను అందజేశారు. గత 30 సంవత్సరాలు గా జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజాసమస్యలపై, ఆధ్వవిధంగా జర్నలిస్తుల సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. నాటి ఉమ్మడి నల్లగొండ నేడు యాదాద్రి జిల్లలో వార్త, మరియు ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న టి రమేష్ కు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు రావడం సంతోషంగా ఉందని పలువురు ప్రజాప్రతినిధులు అయనను అభినందించారు. ఈ సందర్బంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సుభాష్ నగర్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, జీడీమెట్ల సి ఐ జి మల్లేష్ లు జర్నలిస్ట్ టి రమేష్ ను అభినదించారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


