అమరుల స్పూర్తి తో కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాలకు సిద్దం అవుదాం..!
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి లో అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్ర బాగంగా జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు
వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ. కల్లుగీత వృత్తి రక్షించడానికి అనేకమంది వీరులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని అలాంటి హక్కులను ఈనాటి ప్రభుత్వాలు రద్దు చేయాలని చూస్తే కల్లు గీత కార్మికులు ఉద్యమాలకు సిద్దం కావాలని వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతి గ్రామానికి ఈత ,తాటి చెట్ల పెంచుకోవడానికి పది ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రతి గీత కార్మికుడికి బైక్ ఇవ్వాలని గ్రామానికి టాటా ఏసీ వెహికల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్లుగీత వృత్తిని నమ్ముకొని ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారని వృత్తిని రక్షిస్తే మూడు లక్షలతో పాటు ఇంకా ఆదనంగా మూడు లక్షల మంది గౌడ గీత కార్మికులకు దీనిపై బ్రతకడానికి అవకాశం ఉంటుందని ఇలాంటి కల్లు గీత వృత్తి తొలగించాలని అన్నారు. కేవలం మద్యం ఫ్యాక్టరీల యజమానుల కోసం ప్రభుత్వాలు లాభాల కోసం కల్లు గీత వృత్తిపై కల్తీ పేరిట దాడి చేయడం మంచి పద్ధతి కాదని కల్లు గీత వృత్తి రక్షణకై నష్టం చేయాలని చూస్తే గీత కార్మిక సంఘం పోరాటాలు సిద్ధమౌతోందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ కల్లుగీత కార్మికులు అందరూ ఐక్యంగా వృత్తి రక్షణ పోరాటాలు కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ , తో పాటు నాయకులు బాలా గౌడ్,శేఖర్ గౌడ్, మల్లా గౌడ్ సిద్దగౌడ్, అంజాగౌడ్, గంగాధర్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


