అనర్హులను తొలగించి అర్హులకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి…

సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీలు అనర్హులకు ఇల్లు కేటాయించారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు అన్నారు.
ప్రధానంగా భిక్కనూర్ మండల కేంద్రంలో జరిగిన ఇండ్ల పంపిణీలో అనర్హులుఉన్నారని అధికారులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అర్హులకు కేటాయించకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని సోమవారం జిల్లా కలెక్టర్ కి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు స్పందించిన కలెక్టర్ గారు హౌసింగ్ జిల్లా అధికారిని వెంటనే రీ ఎంక్వయిరీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. భిక్కనూర్ గ్రామస్తులు అంత ఇండ్లలో ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇళ్ల స్థలాల కోసం ఆందోళన పోరాటాలు కొనసాగించాలని అర్హులకు ఇవ్వకుండా ఇండ్లున్నవారికి ఉద్యోగులకు కేటాయించడం సరైంది కాదన్నారు. ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే సైతం అభ్యంతరం తెలిపినట్టు ఆయన గుర్తు చేశారు. అర్హులైన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు,. నాయకులు రహిమ హైమధి ది ది బేగం, పుష్ప లక్ష్మి, మంజుల, భాష, లక్ష్మి, నజియా తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


