మహిళ పై అసభ్యంగా ప్రవర్తించిన జగిత్యాల ఎస్ఐ అనిల్ పై పలు సెక్షన్లు క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు IPC Sec 290,323,34
బస్సు ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేసిన జగిత్యాల ఎస్ఐ అనిల్.. ఆడవారి మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి ఓవర్ యాక్షన్ చేశాడు ఓ ఎస్ఐ.
సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఆడవారి పంచాయితీలో తలదూర్చి రచ్చ చేశాడు. ఓ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి,మహిళ అని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించాడు. బస్సును కారుతో ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య కాగా, మరొకరు యువతి. అయితే ఈ గొడవ విషయాన్ని మహిళ తన భర్తకు ఫోన్ చేసింది.
బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఏస్సై అనిల్ బస్సు ఆపాడు. తన భార్యతో ఎవరు నీతో గొడవ పెట్టుకున్నారని అసభ్యంగా మాట్లాడాడు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



