ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి..!
ఈ నూతన విధానం ఆగస్టు 15 నుండి విధిగా అమలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
తిరుమల, 2025 ఆగస్టు 12: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది.
ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు.
ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైనది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



