రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్…


కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్) రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాల్రాజ్ గౌడ్ గారి జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు , అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. అవసరమన్న వారికి ఆపదలో రక్త దానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన విషయంలో రాష్ట్రంలోనే ముందుండాలని అన్నారు. మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని, మన జిల్లాలోని జిల్లా అధికారులు, మరియు సిబ్బంది తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ప్రతి ప్రజావాణిలో కోరుచున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న , కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్థిరం, నరసింహం, రమేష్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు శ్రీనివాస్ రావు, సుధాకర్, కీర్తిశేషులు బాలరాజు గారి భార్య, పిల్లలు, విద్యార్థిని, విద్యార్థులు హాజరయ్యారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


