పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ జీవోలను వెంటనే సవరించాలి
 
2021లో కనీస వేతనాలు పెంచుతూ జారీ చేసిన ప్రిలిమినరీ జీవోలను యథాతథంగా గెజిట్ చేయాలి
వేతనాల పెంపులో సుప్రీంకోర్టు సిఫార్సులను పరిగణంలోకి తీసుకోవాలి
కనీస వేతనాలు రూ. 26 వేలకు పెంచాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్*
సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా
కలెక్టర్ ఏవో కు వినతి పత్రం ఇచ్చిన సిఐటియు నాయకులు…
. కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ జీవోలను వెంటనే సవరించాలని, కనీస వేతనాల సలహామండలి సిఫార్సులు అమలు చేయాలని, 2021లో జారీ చేసిన ప్రిలిమినరీ జీవోలను యధాతధంగా గెజిట్ చేయాలని, వేతనాల పెంపులో సుప్రీంకోర్టు సిఫార్సులు పరిగణంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అనంతరం జిల్లా కలెక్టర్ ఏవో కి సిఐటియు నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బాబాయ్, అరుణ్ కుమార్, సిద్దేశ్వరి, లలిత, సరోజ, అనిత తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


