అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అకాండ భూమి న్యూస్);
అవగాహనతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ బాల్ కిషన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట, పాల్వంచ మండలం భవానిపేట తాండ లలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం వై ఆర్ జి కేర్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ, స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింక్ వర్కర్ మాట్లాడుతూ… హెచ్ఐవి వ్యాప్తి చెందే మార్గాలను వివరించారు. హెచ్ఐవి ఎలా వ్యాపించదు అనే అంశాల గురించి చెప్పారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపవద్దని తెలిపారు. క్షయ, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆయా వ్యాధులపై ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో ముత్యంపేట పిఏసిఎస్ చైర్మన్ తిరుపతి గౌడ్, ప్రధానోపాధ్యాయులు శైలజ, సూర్య ప్రకాష్ గౌడ్, ఉపాధ్యాయులు, గ్రామ యువకులు, పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.


