ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణలో పగడ్బందీగా నిర్వహించాలి…
 
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);
ఆయా శాఖల అధికారులు మండల కేంద్రాలతో పాటు పరిధిలోని గ్రామాలలో పగడ్బందీగా పక్కా ప్రణాళికలతో పనులు నిర్వహించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దోమకొండ, బీబీ పేట మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయా శాఖల అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా పక్కా ప్రణాళికతో గ్రామాల్లో పనులు విజయవంతం అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. దోమకొండ, బీబీ పేట మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన సమావేదానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ లు, అంగన్వాడి సూపర్వైజర్లు, సిడిపిఓ, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎం పి ఓ, పంచాయతీ అధికారులు, విద్యుత్, రోడ్డు భవనాల శాఖ హౌసింగ్ శాఖ, అటవీ శాఖ, సివిల్ పోలీసులు, మత్స్యశాఖ, ఇందిరా క్రాంతి పథకం, రెవెన్యూ శాఖల అధికారులతో పలు విషయాలపై చర్చించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజలు, పాల్గొన్నారు


