విధుల్లో అలసత్వం వహించిన ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

విధుల్లో అలసత్వం వహించిన ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12,( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లాలో విధుల్లో అలసత్వం వహిస్తున్న పోలీసులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఇద్దరు ఎస్సైలు, హోంగార్డులు, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

తాజాగా విధుల్లో అలసత్వం వహించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని దోమకొండ కానిస్టేబుల్ విశ్వనాథ్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిట్లంఎస్సై రాజును ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒకేసారి ఇద్దరు పోలీసులపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Akhand Bhoomi News

error: Content is protected !!