ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభావంతులు కలెక్టర్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభావంతులు కలెక్టర్ కితాబు
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం నిజాంపేట మండలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఆదర్శం. ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యాధుల సమూల నిర్మూలనకు శ్రీకారం చుట్టాలి పశువులకు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి:
నిజాంపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పశువైద్యశాల, ఎంపీడీవో కార్యాలయం, కల్వ కుంట్ల గ్రామంలో అంగన్వాడి ,ప్రాథమిక పాఠశాల, సబ్ సెంటర్, క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభావంతులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం నిజాంపేట మండలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఆదర్శం. అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మంగళవారం నిజాంపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పశు వైద్యశాలను ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్, సబ్ సెంటర్, క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు పురోగతి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పశు వైద్యశాలలో కలెక్టర్ మాట్లాడి బ్లూ టంగ్ వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రిజిస్టర్లు, నమోదు వివరాలను తనిఖీ చేశారు. వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతపురం ఎంపీడీవో కార్యాలన్నీ పరిశీలించి నిజాంపేట మండల అభివృద్ధిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యా ప్రమాణాలతో పాటు పాఠశాల వసతులు, అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభావంతులని కొనియాడారు గణితంలో నిష్ణాతులుగా ఉన్నారని చెప్పారు. సామర్ధ్యాలు తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు.
అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం, ఎత్తు బరువు వివరాలు తెలుసుకుంటూ అంగన్వాడి పిల్లలు నాణ్యమైన పౌష్టిగా హారం అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అంగన్వాడి సెంటర్ నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి నిజాంపేట మండలం ఆదర్శంగా నిలుస్తుందని జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన నిర్మించుకుంటే ప్రభుత్వం వెంటనే బిల్లులు జమ చేయడం జరుగుతుంది తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు ప్లేసు లేక ఎవరైతే సెలెక్ట్ కాకపోవడం వల్ల ఎల్ టు లిస్టు ద్వారా ప్రభుత్వ నిబంధన మేరకు చర్యలు చేపడతామన్నారు.
సబ్ సెంటర్ ను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్యశాల అందాలని వ్యాధుల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి సమయపాలనగా విధులకు హాజరుకావాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ మీరు నిలవ లేకుండా చర్యలు తీసుకోవాలని మలేరియా డెంగ్యూ ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, రాజిరెడ్డి, వైద్యాధికారులు, సబ్ సెంటర్ సిబ్బంది, అంగన్వాడి పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు


