సుప్రీం కోర్టు సంచలన తీర్పు… కాంగ్రెస్ ఎమ్మెల్సీల నియామకాలపై స్టే విధింపు
గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
– కోర్టు తీర్పుతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్); తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది.