రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్)
ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో విఆర్కె జూనియర్ కళాశాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యూరాలిజిస్ట్ డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవయవ దానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు దీనిపైన పూర్తి అవగాహన పెంపొందించుకొని అవయవ దానానికి ముందుకు రావాలని అన్నారు.
రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవయవ దానం పైన అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు అవయవాలు కావాల్సిన వారి సంఖ్య పెరిగిపోవడం చాలా బాధాకరమని అవయవదానం చేయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాల తక్కువగా ఉందని అన్నారు దీనిపైన మరింతగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అవయవ దానం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం గౌరవించి ఆర్థికంగా సహకారాన్ని అందజేస్తే మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, కార్యదర్శి సబ్బని కృష్ణ హరి,కోశాధికారి వెంకటరమణ,రోటెరీయన్స్ సుధాకర్,సంతోష్,నవీన్, ప్రిన్సిపాల్ శంకర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.