మొక్కలను సంరక్షించాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13.(అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అటవీ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.