అడ్వకేట్లకు హెల్త్ కార్డులు అందజేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 13.(అఖండ భూమి న్యూస్)
అడ్వకేట్స్ వృత్తిలో కొనసాగుతున్న వారికి హెల్త్ కార్డులు అందజేత కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నంద రమేష్ చేతుల మీదుగా జిల్లా కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్స్ జి పి శ్యాంగోపాల్ రావ్, లతారెడ్డి, స్టీవెన్ రాజ్ లకు బుధవారం రోజున హెల్త్ కార్డులను అందజేయడం జరిగింది.హెల్త్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడతాయని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నందా రమేష్ అన్నారు. హెల్త్ కార్డులు తీసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించి హెల్త్ కార్డులు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డులు మన కుటుంబానికి మనకి అత్యవసర సమయంలో ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హెల్త్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు.