అధికారులు వీధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్) అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మాచారెడ్డి, పాల్వంచ పరిధిలోని గ్రామాల అధికారులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా మాట్లాడారు. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పక్కా ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి, ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రభుత్వ ప్రోత్సాహంతో వచ్చే పనులను బాధ్యతయుతంగా నిర్వహించి మంచి ఉద్యోగులుగా పేరు తెచ్చుకోవాలని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించినప్పుడే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, సూపర్వైజర్లు వ్యవసాయ అధికారులు, హాస్టల్ వార్డెన్లు, ఉపాధి హామీ, ఐకెపి, విద్యాశాఖ, పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్, విద్యుత్, రోడ్డు భవనాల శాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్, ఫిషర్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇందిరా క్రాంతి పథకం, మండల రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు తోపాటు ఆయా శాఖల అధికారులు తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.