రెడ్డి పేట్ హైస్కూల్లో తనిఖీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

రెడ్డి పేట్ హైస్కూల్లో తనిఖీ చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్); కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట్ జిల్లా పరిషత్ పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే దానిపై సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, త్రాగునీటి వసతులు, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించి సహకరించాలన్నారు. విద్యా బోధన తీరుపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!