భద్రతా చర్యలు ప్రామాణికం గా తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ తెలిపారు.
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13 )
భద్రతా చర్యలు ప్రామాణికం గా తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ తెలిపారు.
బుధవారం చేగుంట మండలం శ్టేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్న శివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కుచ్చారం, శివంపేట మండలం లూయిస్ ఫార్మా సీయుటుకల్స్, ప్రైవేట్ లిమిటెడ్ నవాబ్. పేట సంబంధిత పరిశ్రమలను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ పరిశీలించారు.
ఈ తనిఖీలలో పరిశ్రమలు తీసుకుంటున్న భద్రతా ప్రామాణికాలు, కార్మికుల దినచర్య పరిశ్రమల నిర్వహణ తీరు తెన్నులను కర్మాగారాల్లో పనిముట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని సంబంధిత నివేదికలను

జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


