వెల్దుర్తిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం…

వెల్దుర్తిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం…

వెల్దుర్తి ఆగస్టు 14 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు ఎంపీడీవో సుహాసనమ్మ, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్ ల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగా అనే నినాదాలు చేశారు. ప్రజలకు ఆగస్టు 15 తారీకున ప్రతి ఇంట ఇంట మూడు రంగుల జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 తారీకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఆగస్టు 15న ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ భారతదేశపు దేశభక్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్, ఏపీవో లక్ష్మన్న, పంచాయతీ ఆఫీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!