వెల్దుర్తి విద్యానికేతన్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

వెల్దుర్తి ఆగస్టు 14 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని శారదా విద్యానికేతన్ స్కూల్ నందు గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి వేడుకలను కళ్లకు కట్టినట్టుగా వేషధారణ నటన అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. శ్రీకృష్ణుని వేడుకలను స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించడం జరిగింది.


