కన్నుల పండుగగా హర్ ఘర్ తిరంగా యాత్ర.

‘జాతీయవాద భావజాలంతో పని చేయాలి
వై రామవరం మండల బిజెపి అధ్యక్షులు కడబాల ఆది విష్ణు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆగస్టు 14 (అఖండ భూమి వెబ్ న్యూస్) రంపచోడవరం నియోజవర్గం వైరామవరం మండలం లోతట్టు ప్రాంతం కోట పంచాయితీ కోట గ్రామంలో గురువారం నాడు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా చేతబట్టి
తమ దేశభక్తుని చాటుకుంటూ వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని బిజెపి వై రామవరం మండల అధ్యక్షులు కడబాల ఆది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే వెంకటరెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా యాత్ర లో పాల్గొన్నారు.


