నవోదయ’లో ఆరో తరగతి ప్రవేశాలు.. మళ్లీ గడువు పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్)
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆగస్టు 27వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా 654 జేఎన్‌వీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి రెండు విడతల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడత 2025 డిసెంబర్ 13న, రెండో విడత 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. 75% సీట్లు గ్రామీణ విద్యార్థులకు, మిగతావి పట్టణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉండగా, పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.



