స్వాతంత్ర దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి
 
(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 14)
15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వాణ కోసం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో చేస్తున్న ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథికి, ఇతర విఐపి లకు, అధికారులకు, మీడియా వారికి, విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని, జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ముందస్తు నిర్దేశించిన సమయం ప్రకారం పోలీస్ పెరేడ్, ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంస పత్రాల ప్రధానం తదితరుల అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, స్టేజి డెకరేషన్, సౌండ్ సిస్టం ఏర్పాటు, వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ ఇతర అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


