79 వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)
79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా సిఐటియు అధ్యక్షుడు చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారతదేశ స్వతంత్ర పోరాటం కేవలం ఒక ఉద్యమం కాదని అది ఒక అపారమైన త్యాగాలకు ప్రతీక అని ఒకవైపు గాంధీజీ చూపించిన హింస మార్గం, కోట్లాదిమంది ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని మరోవైపు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్ గురు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరులు సాయుధ పోరాటంతో కమ్యూనిస్టు బాటలో యువతను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి యువతను స్వతంత్ర పోరాటంలో జాగృతం చేశారని గుర్తు చేశారు. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు సిక్కులు జైనులు బౌద్ధులు సోషలిస్టులు సెక్యులర్ వాదులు మాత్రమే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు సావర్కర్, హెగ్డే వార్ లాంటి మితవాదులు స్వాతంత్ర పోరాటానికి దూరంగా ఉన్నారని అరెస్టయినా సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి దాదాపు 12 క్షమాభిక్ష ఉత్తరాలు వ్రాసాడని క్షమాభిక్ష తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా పనిచేశారాని అన్నారు. రాజ్యాంగాన్ని నమ్మని తాతకు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాల వరకు కూడా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేయలేదని చెప్పారు.
స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల అవుతుందా ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్మని వ్యక్తులు శక్తులు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వారని తెలిపారు దేశభక్తి లేని వారు దేశభక్తులుగా చలామణి కావడానికి ప్రయత్నిస్తున్నారని ఈ కుట్రలను దేశభక్తి యొక్క శక్తులు అడ్డుకోవాలని కోరారు.
సంపూర్ణ స్వాతంత్య్రం కావాలి అని మొదటగా డిమాండ్ పెట్టింది కమ్యూనిస్టులేనని అప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిజేశారు. 1921లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండ్ చేయాలని తీర్మానం పెట్టారు. అది వీగిపోయిందనీ. 1927లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 6వ మహాసభలో భారత ప్రతినిధులు (ఎం.ఎన్. రాయ్ తదితరులు) చొరవతో ‘భారత స్వాతంత్య్రం అంటే పూర్తి స్థాయి స్వరాజ్యం తప్ప డొమి నియన్ స్టేటస్ కాదు’ అని స్పష్టంగా తీర్మానించారు. దీని ప్రభావం మన ఉద్యమంపై తీవ్రంగా పడింది. ఈ ఆలోచనలను దేశంలోని కమ్యూనిస్టు విప్లవకారులేగాక, కాంగ్రెస్‌లోని అభ్యుదయ వాదులు జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, ఇతర వామపక్ష వాదులు బలపర్చారు అని గుర్తు చేశారు.1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలోనూ వీరంతా ఆ తీర్మానాన్ని ముందుకు తెచ్చారు. చివరకు తర్వాత ఏడాది 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ మహాసభలో మాత్రమే ‘సంపూర్ణ స్వాతంత్య్రం’ డిమాండ్‌తో తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. ఆ తర్వాత స్వాతంత్రోద్యమ దశ, దిశ మారింది. ఉధృత పోరాటాలతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టగలిగాం. ఆ పోరాటం మొత్తానికి లౌకికవాదం, ఆర్థిక దోపిడీనుండి విముక్తి ఆకాంక్షలు పునాది రాళ్లుగా ఉన్నాయి అన్నారు.ఆ ఆకాంక్షలు రాజ్యాంగ సారాంశంలోనే ఉన్నాయి. ఆ సారాంశాన్ని వ్యక్తం చేయటానికి పదాలు కూడా చేర్చారు. వాటిని విస్మరించటమంటే మన స్వాతంత్రోద్యమాన్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది
ఒక తెల్లవాడు పోయి మన నల్లవాడు పాలిస్తే స్వాతంత్య్రం వచ్చినట్టా? ఆనాడు ప్రధానంగా కోరుకున్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన వనరులను, సంపదలనను దోచుకుంటున్నారు. ఆ దోపిడీ నుండి విముక్తి కావాలని మన సంపదలను మనమే అనుభవించాలని కోరుకున్నాం. అంటే అందరికీ తిండి, ఇల్లు, విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, రైతులు, కూలీలు, వృత్తిదారులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజన తదితర సమస్త వర్గాలు, తరగతుల ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితులు రావాలని కోరుకున్నాం. ఈ సమాన అవకాశాల సాధనే సోషలిజానికి సాధారణ అర్థం. నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సాధారణ అర్థంలోనే తాము అధికారంలోకి వస్తే ఈ సౌకర్యాలన్నీ ప్రజలకందిస్తామని చెబుతున్నారు.
అందువల్ల ప్రజలందరి త్యాగాలతో మనం సాధించుకున్న స్వాతంత్య్రం పూర్తి అర్థంలో ప్రజల అనుభవంలోకి రాకపోగా ఉన్న కొద్దిపాటి స్వేచ్ఛలు కూడా బీజేపీ మతోన్మాద, నిరంకుశ పాలనలో హరించుకుపోతున్నాయి. రాజ్యాంగానికి రక్షణ లేకు ండా పోతున్నది. అందువల్ల మన స్వాతంత్య్ర వెలుగులను రాహు,కేతువులుగా కబళిస్తున్న మతోన్మాదం, నయా ఉదారవాదం అనే జంట సర్పాలను సంహరించటం, రాజ్యాంగ రక్షణకు ఉద్యమించటం ఈ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తులందరి కర్తవ్యం కావాలి. ఈ కార్యక్రమంలో పోచయ్య రాజేందర్ ,నాగరాజు, భూపతిరెడ్డి ,రమేష్, బాలయ్య, ఆశయ్య, గంగారం, రాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



