సౌత్ క్యాంపస్ లో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవం…

సౌత్ క్యాంపస్ లో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ మూడు రంగుల జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాలు బ్రిటీష్ వలసవాద పాలనలో ఉన్న భారతదేశం ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఎన్నో పోరాటాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకుందని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో స్వాతంత్ర వీరులు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.స్వరాజ్యం సాధించుకున్నాక నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత దేశం సాగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్ లు డా.సునీత,డా.యాలాద్రి, అధ్యాపకులు డా.మోహన్ బాబు, డా.లలిత,డా.హరిత,డా.ప్రతిజ్ఞ, డా.అంజయ్య,డా.నాగరాజు,డా.నారాయణ,డా.శర్మ, డా.సంతోష్ గౌడ్ పోతన్న ,సునీల్ ,శ్రీకాంత్ హాస్టల్ కేర్ టికెట్ లు వేణు,హారిక,సిబ్బంది బాలరాజు,స్వామి,రాజేశ్వర్,రవి, సత్తయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!