జాతీయ జెండాను ఎగరవేసిన దోమకొండ గడికోట వారసుడు కామినేని అనిల్…

జాతీయ జెండాను ఎగరవేసిన దోమకొండ గడికోట వారసుడు కామినేని అనిల్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 15 (అఖండ భూమి న్యూస్)

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ గడికోటలో కోట వారసులు కామినేని అనిల్ కుమార్ జాతీయ పతాకాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. తదనంతరం గ్రామస్థాయిలో వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తో నిర్వహించినటువంటి క్రీడల్లో విజేతలకు బహుమతుల ప్రధానం మరియు స్వాతంత్ర సమరయోధల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించి వారి యొక్క త్యాగాలను స్ఫూర్తిని విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ గారు,మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ వారు, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, బత్తిని సిద్ధిరాములు, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి ట్రస్ట్ మేనేజర్ బాబ్జి ప్రతినిధులు గణేష్, రాజశేఖర్, వివిధ పాఠశాల విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!