కేజీబీవీ విద్యార్థిని మృతి పై సబ్ కలెక్టర్ విచారణ
-సంఘటన వివరాలు విద్యార్థుల నుండి స్వీకరణ
-పత్రికల్లో వచ్చిన కథనానికి, ఇక్కడ జరిగిన సంఘటనకు తేడా ఉంది
-పలు అనుమానాలను వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 14: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ (కేజీబీవీ) కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కావేరి (16) వేకువ జామున మూడున్నర ప్రాంతంలో వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా కోతులు వెంట పడడంతో భయపడి ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందికి దూకడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం కావేరి మృతి చెందింది. కోతులు వెంటపడడంతో భయపడి రక్షించుకోవడానికి కావేరి ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు అన్ని పత్రికల్లో వచ్చింది. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా, తాసిల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రాజులతో కలిసి గురువారం కేజీబీవీ విద్యార్థిని కావేరి మృతి పై విద్యార్థులను, కళాశాల ప్రిన్సిపల్ గంగామణి, సిబ్బందికి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన కథనాలకు, విద్యార్థులు చెప్పిన దానికి, జరిగిన సంఘటనకు పొంతన లేకుండా ఉందని అన్నారు. పోలీసులతో మాట్లాడి విచారణ చేయిస్తామన్నారు.
-విద్యార్థిని మృతి పై అనుమానాలే ఎక్కువ..?
కేజీబీవీ విద్యార్థిని కావేరి వేకువ జామున మూడున్నర గంటలకు మొదటి అంతస్తులోని టాయిలెట్ కోసమే బయటకు వచ్చిందా..? కావేరికి కనిపించిన కోతులు మరో ఇద్దరు విద్యార్థులకు ఎందుకు కనిపించలేదు..? మొదటి అంతస్తులు ఉండే కావేరి రెండో అంతస్తు గది వద్దకు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది..? మొదటి అంతస్తు, రెండో అంతస్తు గదులకు బయట నుండి గడియ ఎవరు పెట్టారు..? కావేరి దూకింది మొదటి అంతస్తు పైనుండా, రెండవ అంతస్తు నుండా అని పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



