విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రధానం 

విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రధానం

 

-విద్యార్థులను మరింత ప్రోత్సాహించడానికే

-కోమన్ పల్లి బట్టు చంద్రశేఖర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 15: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, మండలంలోని కోమన్ పల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2024-25 పదో తరగతికి సంబంధించిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ శ్రేణి విద్యార్థులకు కోమన్ పల్లి గ్రామానికి చెందిన బట్టు చంద్రశేఖర్ ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తే విద్యార్థులు మరింత పోటీ తత్వం పెరుగుతుందని దీంతో విద్యార్థులు మరింత కష్టపడి చదువుతారని ఉద్దేశంతో విద్యార్థులు సుకృతకు 5 వేలు, కిషోర్ లకు 3 వేలు నగదు ప్రోత్సాహకాన్ని శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకల రోజు అందించడం జరిగిందని బట్టు చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం ఆయనను ప్రధానోపాధ్యాయురాలు కవిత, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగారాం లు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!