భాషిత లో కృష్ణుడు మురిసిపోయేలా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 

భాషిత లో కృష్ణుడు మురిసిపోయేలా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

-వేడుకలకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన పల్లె గంగారెడ్డి

-చిన్న వయసు నుండే భక్తి భావాన్ని పెంపొందించడం అభినందనీయమని ప్రశంస

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 15: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణంలోని శ్రీ భాషిత స్కూల్ కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అధ్యక్షతన 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అనంతరం క్షత్రియ ఫంక్షన్ హాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో వేసి భక్తి భావాన్ని చాటారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ చిన్ని కృష్ణుడు రాధిక, గోపికల వేషధారణ చూస్తే నిజంగానే కృష్ణుడు, రాధికలను తలపించేలా ఉందన్నారు. భాషిత విద్యార్థుల్లో ఇప్పటినుండే భక్తి భావం పెంపొందించేలా చేస్తున్నారని కరస్పాండెంట్ సుందర్ ను అభినందించారు. భాషిత సుందర్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తి, ధర్మం, నీతి విలువలను సూచిస్తాయన్నారు, ఇలాంటి సాంస్కృతిక వేడుకలు పిల్లల్లో భక్తి భావాన్ని, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలియజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!