నలందలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

నలందలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 15: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణం మామిడిపల్లిలోని నలంద స్కూల్లో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. అంతకుముందు పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్ జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలపై నృత్యం చేశారు. వివిధ దేశభక్తుల దుస్తులతో అలరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. భారతదేశం కోసం ఉద్యమించిన నాయకులను, స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం కారణంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని తెలియజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!