ఘనంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  

ఘనంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

( మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు

జి. వివేక్ వెంకటస్వామి

పోలీసుల గౌరవ వందనం స్వీకరణ

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని వివరించిన మంత్రివర్యులు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివిధ స్టాల్స్ ఏర్పాటు

ఉత్తమ సేవలందించిన అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత

79వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో *పాల్గొన్న మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,

ఎస్పీ డివి శ్రీనివాసరావు,అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి

డిఆర్ఓ భుజంగరావు, వివిధ శాఖలకి చెందిన జిల్లా స్థాయి అధికారులు, వారి సిబ్బంది*

79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్య్ర్య సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, పురప్రముఖులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థినీ, విద్యార్ధులకు, పాత్రికేయులకు నా హృదయ పూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి అధ్వర్యములో రూపొందించ బడిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. మన ఆకాంక్షలను అర్థం చేసుకొని, మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం. భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగ ధనులందరికి ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన తెలంగాణ వీరులకు జేజేలు పలుకుతు, ఈ పోరాటంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు.

మన మెదక్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల సమాచారం మీ ముందు ఉంచుతున్నాను.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి:

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 3 కోట్ల 02 లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 83 కోట్ల 50 లక్షల రూపాయల లబ్ది చేకూరింది.

విద్యుత్ శాఖ గృహజ్యోతి:

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 27 వేల 393 విద్యుత్ వినియోగదారులకు 200 యునిట్ల లోపు జీరో బిల్లు జారి చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటివరకు 65 కోట్ల 03 లక్షల సబ్సిడి అందచేసింది.

వ్యవసాయ శాఖ రైతు భరోసా:

వానాకాలం 2025 సంవత్సరమునకు గాను మొత్తం 2,62,043 రైతుల ఖాతాల్లో 220 కోట్ల 84 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది.

రైతు రుణమాఫీ:

మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87 వేల 491 మంది రైతన్నలకు 645 కోట్ల 41 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.

వైద్య మరియు ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ:

రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 18 వేల 626 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు, అందుకు గాను ప్రభుత్వం 49 కోట్ల 71 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

జిల్లాలో కొత్త మెడికల్ కాలేజి మరియు నర్సింగ్ కాలేజిలను ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజి బిల్డింగ్ కొరకు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ కొరకు 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

పౌర సరఫరా శాఖ : 500 రూపాయలకే వంట గ్యాస్:

ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 26 వేల 796 మంది వినియోగదారులకు 4 లక్షల 68 వేల 195 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 13 కోట్ల 18 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో 2 లక్షల 16 వేల 716 కుటుంబాలకు చౌక ధర దుకాణాల ద్వారా జూన్ 2025 నుండి ఇప్పటి వరకు మూడు నెలలకు సరిపడే 13 వేల 923 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా ఒకే సారి పంపిణి చేయడం සෆියි.

జిల్లాలో 9964 కొత్త రేషన్ కార్డులు మంజురు చేయడం జరిగింది. మరియు కార్డులలో పిల్లలను చేర్చుట తదితర మ్యుటేషన్లు వంటి 34 వేల 730 దరఖాస్తులను విచారణ జరిపి ఆమోదించడం జరిగింది. వీరికి సెప్టెంబర్ 2025 మాసంలో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది.

యాసంగి 2024-25 సీజన్లో జిల్లాలోని రైతులందరికీ నిర్దేశించిన మద్దతు ధర కల్పించుటకై, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 19 వేల 144 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను 80 వేల 873 మంది రైతుల నుండి కొనుగోలు చేసి ఇప్పటివరకు 740 కోట్ల 42 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. 14,994 మంది రైతుల నుండి 62,747 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించటం జరిగింది. వీరికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చొప్పున మొత్తం 31 కోట్ల 37 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో త్వరలోనే జమ చేయడం జరుగుతుంది.

విద్యా శాఖ:

మెదక్ జిల్లాలోని 74 వేల 265 విద్యార్థులకు రెండు జతల ఏక రూప దుస్తులను పాఠ్య పుస్తకాలను, వర్బుక్లు మరియు నోట్ బుక్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు గల 32 వేల 773 విద్యార్థులకు కూడా నోట్ బుక్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్ లలో డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాము.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల మరమత్తుల కొరకు 3 కోట్ల 26 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

జిల్లాలో కొత్తగా 200 కోట్ల రూపాయలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగింది.

గృహ నిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇండ్లు :

మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మొదటి విడతలో 456 కోట్ల 25 లక్షల వ్యయంతో 9 వేల 125 ఇండ్లు మంజూరు కాగా ఇందులో అత్యధికమైన ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశలలో కలవు ఇండ్ల నిర్మాణ ప్రగతిని బట్టి ఇప్పటి వరకు 1302 లబ్దిదారులకు 13 కోట్ల 42 లక్షల రూపాయలను వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది.

రెవిన్యూ శాఖ భూభారతి చట్టం :

కొత్త భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచడానికి ప్రతి రెవిన్యూ గ్రామంలో ప్రజల వద్దకే వెళ్లి రెవిన్యూ సదస్సులు నిర్వహించి 37,817 వేల అర్జీలు సేకరించడం జరిగింది. ఈ అర్జీలను చట్టప్రకారం విచారణ చేసి అతి త్వరలో పరిష్కరించబోతున్నాము.

అటవీ శాఖ:

జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం 37 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 23 లక్షల 24 వేల మొక్కలు నాటడం జరిగింది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సమస్త

ఇందిరా మహిళా శక్తి భవనానికి 5 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా గడచిన ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా 110.53 కోట్ల రూపాయలతో 7758 మహి సభ్యులకు చిన్న తరహ వ్యాపారాలు పెట్టించి వారి ఆర్ధిక ప్రగతికి తోడ్పడడం. జరిగింది. వడ్డీ లేని రుణాల కింద 10 వేల 574 మహిళ సంఘాలకు 21.69 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ మంజూరి చేయడం జరిగింది.

పంచాయతీ రాజ్ శాఖ

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి పరిసరాల అభివృద్ధి కొరకు 35 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించడం జరిగింది.

మెదక్ చర్చి పరిసరాల అభివృద్ధి కొరకు 29 కోట్ల 18 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంబించడం జరిగింది.

విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా మరియు శిశు సంక్షేమం, రోడ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మునిసిపాలిటులు, వాటర్ సప్లై, వెటర్నరీ ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాదించడం జరగిందని చెప్పడానికి ఆనందిస్తున్నాను.

పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్ధాల మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!