79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు మహేష్కర్ పావని, 79 వ స్వతంత్ర జెండా వందనం

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15)  79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆందోల్ మండల్ జోగిపేట్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు మహేష్కర్ పావని గారు గణతంత్ర దినోత్సవ వేడుకలను తమ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎంతోమంది దేశ భక్తుల ప్రాణత్యాగం వల్ల ఈరోజు మనకు స్వతంత్రం లభించిందని 1947 14 తేదీ చరిత్రలో ఒక మరుపురాని రోజుని భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం వల్ల ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయారని ఆమె ఈ సందర్భంగా వాళ్ళందరికీ నివాళులు సమర్పించారు కుల మతాలకు అతీతంగా అందరూ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అందరూ మతసామ్రస్యాలతో అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల ఉండాలని భిన్నత్వంలో ఏకత్వంగా భారత దేశ ప్రజలందము ఒకటే అని చాటుకోవాలన్నారు ఇప్పుడు భారతదేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని దీన్ని చూసి మనమందరము గర్వపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆందోల్ నియోజకవర్గం కో కన్వీనర్ మహేష్కార్ సుమన్ ఆధ్యాత్మికవేత్త లింగమయ్య గారు యాదగిరి అనిల్ బసవ రెడ్డి ప్రదీప్ రెడ్డి భూమయ్య గడ్డమీది రాజు రత్నపురి జగన్నాథం పద్మ జోగినాథ్ శ్రీకాంత్ శివ నవీన్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!