కృష్ణ అంటే ఎవరు., నేడు క్రిష్ణ అష్టమి…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 15(అఖండ భూమి న్యూస్)
కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం!
కృష్ణ అంటే ఒక దేహం కాదు. కృష్ణ అంటే ఒక విగ్రహానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక కాలానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక చైతన్యం! సర్వ వ్యాప్తి, కాలాతీతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, వ్యాకరణం, ఒక ఇంజనీర్, ఒక వైద్యుడు, ఒక న్యాయ మూర్తి, ఒక రైతు, ఒక కాపరి, ఒక సైన్యం, ఒక చక్రవర్తి, ఒక మార్గదర్శి, ఇంకా ఎన్నో ఆయనే..ముఖ్యంగా ‘పరమాత్మనే నేను!’ అని చెప్పిన వాడు. ‘నేను అంతటా ఉన్న వాడిని నీలోని నాలోని ఉన్నది నేనే!’ అనిచెప్పినవాడు. నేనే అంటే పరమాత్మే అని చెప్పినవాడు. ‘అర్జునా నేను అది తెలుసుకున్నాను నీవు తెలుసుకోలేదు, నీవు నేను ఒక్కటే! అది నీవు కూడా తెలుసుకో. అది జ్ఞానం ద్వారా దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే. నీకు ఆ దివ్య జ్ఞానాన్ని తెలుపు తున్నాను.’ అని భగవద్గీతను అర్జునుడికి బోధిస్తున్నట్లు సర్వ మానవాళికి అందించిన ప్రేమస్వరూపుడు. కృష్ణపరమాత్మ స్వరూపం రూపం అందరిలోనూ, అన్నిటి లోనూ, అంతటా వ్యా పించి ఉన్నవాడు.కృష్ణ అంటే కృషిచేయవాడు. అంటే వ్యవసాయంచేయువాడు. మన హృద యాలలో ఉన్న చీకటి అనే అజ్ఞాన మాలిన్యం తొలిగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రకాశింప చేసేవా డు.కృష్ణ అంటే చీకటి. నలుపు అందులో నుండివచ్చిన వెలుగే ఈప్రకాశం.ఎవరైతే తమలో ఉన్న నేను అనే అజ్ఞానాన్ని పారద్రోలు కుంటారో వారిలో జ్ఞానమైతిష్టవేసుకునికూర్చుంటాడు.కృష్ణడు పూజలకు, స్తోత్రాలకు, భజనలకు జపా లకు, కీర్తనలకు, ద్యానా లకు, తపస్సులుకి, దాన ధర్మాలకు, క్షేత్రదర్శనాలకులభ్యంకాడు.తానుచెప్పినదిఅర్థంచేసుకున్న వాడు, తాను చూపిన మార్గం లో నడిచిన వాడు, ఎవరైతే కర్మ చేస్తూ కర్మ మార్గంలో ఉంటూ నిష్కా మ మార్గాన్ని అవలంబించి, నేను చేస్తున్నా ను అన్న భావనని విడిచి పెడ తారో, ఎవరైతే తన మార్గంలో ఉం టూ ఎవరైతే తమ హృద యాల్లోకోపం,ద్వేషం,అసూయ, డాంభికం, దర్పం, ఈర్ష్య, పగ ప్రతీకారం, గర్వం, అహంకారం మొదలగు మాలిన్యాలను లేకుండా ఉంటారో, ఎవరైతే అన్నిటి లోనూ, అందరిలోనూ, సర్వ జీవులలో, సర్వ జీవ జాతులలోనూ,పసుపక్ష్యాలలోనూ, సర్వ మానవాళిలోనూ తననే చూసుకుంటారో, నేను శరీరం కాదు ఆత్మ స్వరుపం అని తెలుసుకుంటారో, ఎవరై తే నిరంతరం ఆనంద స్వరూ పంగాఉంటారోఇంకాఉన్నాయి.వారికి కృష్ణుడులభ్యంఅవుతా డు.ఆయ న బాటలో నడుస్తూ భగవద్గీతాపఠనంచేద్దాం.మనంఉద్ధరింప పడదాం.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


