వరద ప్రభావిత ప్రాంత ప్రజలు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి 9391942254 కలెక్టర్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)
24 /7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..
వరద, వర్షం ప్రభావిత ప్రజలుసద్వినియోగం చేసుకోవాలి*
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను శనివారం పరిశీలించిన కలెక్టర్.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ కలెక్టరేట్, జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ముందుగా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటుచేసిన రిజిస్టర్ ని పరిశీలిస్తూ ప్రజల సమస్యలపై. ఎన్ని ఫిర్యాదులు వచ్చినవి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు
కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తున్నారని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారని చెప్పారు 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వే ల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఎక్కడైతే అత్యధిక వర్షపాత నమోదయిందో ఆయా ఏరియా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు ప్రజలు వర్షాభావ పరిస్థితుల్లో దృశ్య వారికి కలిగిన అసౌకర్యాన్ని కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇస్తున్నారని చెప్పారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


