అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ
-మండల పరిషత్ కార్యాలయం
-పంచాయతీ కార్యదర్శులకు వాట్సాప్ కాల్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్ట్ 16: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, మండల పరిషత్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అంకిత్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు కార్యాలయాల్లో ఉన్నారా లేదా అన్నది ఆయన పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శివాజీ, ఎంపీఓ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గ్రామాలలో వర్షాలు కురుస్తున్నందున ఏలాంటి పరిస్థితి ఉందని అడిగి తెలుసుకున్నారు. వేకువజాము నుంచి వర్షాలు కురుస్తున్నందున ఇబ్బందులు లేవని, భారీ వర్షాలు కురిస్తే శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే కుటుంబాల వారికి ఇతర ప్రాంతాలకు తరలిస్తామని ఎంపీడీవో తెలిపారు. గ్రామాలలో గ్రామ కార్యదర్శులు కార్యాలయాలలో ఉన్నారా లేదా అన్నది అదనపు కలెక్టర్ తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నారా అంటూ తెలుసుకునేందుకు మండలంలోని పిప్రి, కోమన్ పల్లి గ్రామ కార్యదర్శులు మురళి కాంత్, సురేష్ లతో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడారు. గ్రామ కార్యదర్శులు రెండు, మూడు రోజులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. చేపూర్, పల్లె గ్రామ కార్యదర్శి కార్యాలయంలో ఉన్నాడా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారికి సురక్షితంగా ఉండాలని మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు ఎంపీడీవో శివాజీ చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లవారికి ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



