శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల వేషాధారణ అదుర్స్
-ఘనంగా వేడుకలు జరుపుకున్న ప్రజలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 16: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్,
పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షం పడుతున్న భక్తులు శ్రీకృష్ణ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇండ్లలో కుటుంబ సభ్యులు తమ పిల్లలను రాధాకృష్ణుల వేషధారణలో చక్కగా అలంకరించారు. రాధాకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులు భక్తి గీతాలపై నృత్యాలు చేశారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఆలయాలలో శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. కృష్ణాష్టమి విశిష్టత గురించి వివరించారు. శ్రీకృష్ణుని లీలలను గురించి తెలిపారు. అనంతరం ఆలయాలలో తీర్థప్రసాద వితరణ జరిగింది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



