డీజే లను నిషేధించిన ఆర్మూర్ సర్వ సమాజ్
-వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం
-మట్టి గణపతి లను ప్రతిష్టిద్దాం, భక్తితో పూజిద్దాం
-వినాయక మండప నిర్వాహకులు సహకరించాలి
-సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి నవనాథపురం అభ్యర్థన
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 16: (అక్కడ భూమి న్యూస్) ఆర్మూర్, ఈసారి వినాయక చవితి కి పిఓపి విగ్రహాలను ప్రతిష్టించకుండా, మట్టి గణపతులను గణేష్ ప్రతిష్టించి పర్యావరణం కలుషితం కాకుండా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుందామని సర్వ సమాజ్ శనివారం పిలుపునిచ్చింది. డీజే లు పెట్టడం వల్ల వయసు పైబడిన వారు ఇబ్బందులు పడుతున్నందున డిజె సిస్టంలను నిషేదించామని, మండపాల నిర్వహణకు విద్యుత్ శాఖ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని వారు కోరారు. మున్సిపల్ అధికారులు గుండ్ల చెరువు వరకు గుంతలు లేకుండా పూడ్చివేసి, గుండ్ల చెరువు వద్ద బారికెడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుతంగా జరిగే విధంగా చూడాలని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కు సర్వ సమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, సభ్యుడు చక్రధర్ వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ పరిధిలోని అన్ని కుల సంఘాలు, యువజన సంఘాలు, గణేష్ మండపాల నిర్వాహకులు, అన్ని పార్టీల వారు సహకరించాలని వారు కోరారు.



