తెగిపోయిన చెక్ డ్యాం.. గ్రామంలోకి వరద నీరు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్ కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైంది. శనివారం
నీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసిరకం పనులతో నిర్మించిన చెక్ డ్యామ్ నాణ్యత లోపించి దెబ్బతినడంతో ఈ పరిస్థితికి కారణమని ఎమ్మెల్యే తెలిపారు..
చెక్ డ్యామ్ కెనాల్స్ ను పునర్నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు చెప్పారు.
ఎమ్మెల్యే తానే స్వయంగా వాటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్ వేసి అధికారులకు వివరించారు..
అధికారుల బృందం జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించి ఇవ్వాలని,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం అందేలా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు..
వర్షాలు తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


