వయోవృద్ధుల అనుభవం సమాజానికి ఎంతో అవసరం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరవ జాతీయ సోషల్ వర్క్ వారోత్సవాలలో భాగంగా డాక్టర్ శారదా దేవి శనివారం వృద్ధాశ్రమాన్ని సందర్శించిన, తెలంగాణ యూనివర్సిటీ సోషల్ వర్క , కామారెడ్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు. వయోవృద్ధులను గౌరవించే, వారిని సమాజంలో భాగస్వాములను చేసే వాతావరణాన్ని సృష్టించాలి. వారి అనుభవాలను, ఆలోచనలను వినియోగించుకోవడం దేశానికి ఎంతో ప్రయోజనకరం. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగ అధిపతి. డాక్టర్ బి అంజయ్య మాట్లాడుతూ అనేక రకాల ఆర్థిక సామాజిక సాంఘిక ఇబ్బందులతో వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగిందన్నారు. వారి వృద్ధాప్యం దశ లో ఆశ్రమంలో వారి తోటి కలిసిమెలిసి వారి మానసిక అభివృద్ధి కొరకు సమాజంలో ఉన్న అందరు తోడ్పాటు అందించాలని వారిపట్ల దయాగుణం కలిగి ఉండాలని వారికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని, సమాజంలోని అందరూ వారి వారి తల్లిదండ్రులను, గౌరవించి వారి అభివృద్ధిలో తల్లిదండ్రులు ఎంతో ముఖ్య పాత్ర పోషించారని, అలాంటి అంశాలను గుర్తించుకొని వారి పట్ల గౌరవ మర్యాదగా మెలగాలని అన్నారు. అదేవిధంగా అక్కడున్న సిబ్బంది వారి పట్ల దయాగుణంతో మరియు మానసిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటున అందిస్తున్నారని వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు బాగోగులు చూస్తున్నారని అన్నారు. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి వీరి పట్ల మానసిక, శారీరిక ఆరోగ్యం కొరకు తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ వర్క్ విద్యార్థులు వారి యొక్క మానసిక ఉల్లాసానికి వారితో పాటలు పాడించడం ఆటలు, నాట్యం, చేయించడం జరిగింది. వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా అధ్యాపకులు, మరియు సోషల్ వర్క్ విద్యార్థులు వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ శారదా దేవి గారి యొక్క అనుభవాలను వారు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి, వారికి కావాల్సిన అవసరాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అధ్యాపకులు, డాక్టర్ జి రమేష్, డాక్టర్ పి బి సత్యం, శారదా దేవి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ బి శారద దేవి, బి రాజన్న, ఇంచార్జ్ శ్రీలక్ష్మి, నర్స్ మంజుల, కోశాధికారి సాయి ప్రియ, సోషల్ వర్క్ విద్యార్థులు, రత్నాకర్ నవీన్ సుజాత మనిషా శ్రీకాంత్ మౌనిక* తదితరులు పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


