హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఉపాధ్యక్షులుగా రంగు శ్యామ్ సుందర్
గోదావరి ఖని, 16 ఆగష్టు అఖండ భూమి న్యూస్ : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా రంగు శ్యామ్ సుందర్ నియామకం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన రంగు శ్యామ్ సుందర్ ఎన్నికయ్యారు. గత నాలుగు సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ, మానవ హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల పురోగతి కోసం పాటుపడుతున్న శ్యామ్ సుందర్ గతంలో వివిధ పదవులలో పని చేసిన సేవలను గుర్తించి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ ని నియమించడం జరిగినది. ఈ పదవిలో రెండు సంవత్సరాల కాల పరిమతి కొనసాగుతారు.ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన, జాతీయ ప్రధాన కార్యదర్శి చారేంద్ర , జాతీయ ఉపాధ్యక్షుడు భేతి తిరుమల్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగ్దీర్, చాడ రవీంద్ర రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



