జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా కోహెడ PHC ని తనిఖీ చేస్తున్నారు
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
జిల్లా కలెక్టర్ కె హైమావతి శనివారం సాయంత్రం కోహెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా సందర్శించి ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్, ఇన్ పేషంట్ రిజిస్టర్, ఆరోగ్య మహిళ, వ్యాక్సినేషన్ తదితర రిజిస్టర్లను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ తనిఖీ సమయంలో స్టాఫ్ నర్స్ సృజన విధులలో ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ లో ఎలాంటి లీవ్ సాంక్షన్ లేకుండా గైర్హాజరైన సిబ్బంది విజయ మరియు సతీష్ కుమార్, సరియైన అధికారి సాంక్షన్ లేకుండా మెడికల్ లీవ్ లో ఉన్న ఆయుష్ డాక్టర్ కిరణ్ కుమారి, డిప్యూటేషన్ క్యాన్సల్ చేసిన చేసిన వాపస్ వెళ్ళకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తున్న లద్నూర్ పిహెచ్సి నుండి డిప్యూటేషన్ పై వచ్చిన నర్సింగ్ స్టాప్ పూజ ల పై చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.
వర్షాకాలం కాబట్టి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది మరింత అలర్ట్ గా ఉండి వైద్య సేవలు అందించాలని, అవుట్ పేషెంట్ రిజిస్టర్ ను డాక్టర్ కచ్చితంగా మెయింటైన్ చేయాలని, ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పర్యటనలో కోహెడ తాసిల్దార్ మహమ్మద్ సమీర్ ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారిచేచేయనైనది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



