తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 17 (అఖండ భూమి న్యూస్)
గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ లో 367% పెరగ్గా, తెలంగాణ రాష్ట్రంలో 917% పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో 1578 అబార్షన్లు జరగ్గా 2024-25లో ఆ సంఖ్య ఏకంగా 16,059కి పెరిగింది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో 10,676 కేసులు నమోదయ్యాయి. దీంతో 25,884 అబార్షన్లతో కేరళ టాప్ 1 లో ఉంది.ఈ గణాంకాలను కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో సమర్పించారు.



