వెల్దుర్తిలో ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం..
వెల్దుర్తి ఆగస్టు 17 (అఖండ భూమి) :
వెల్దుర్తి ఏపీయూ డబ్ల్యూ జె యూనియన్ తరపున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకుల ఆదేశాల మేరకు ఆదివారం వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు, బాలింతలకు పండ్లు, బెడ్లు, పాలు డాక్టర్ శృతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులకు, అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఏపీయూ డబ్ల్యూ జె యూనియన్ నాయకులు చంద్రశేఖర రావు, అమీర్, ఈశ్వరయ్య, రాజు, తాజ్ బాబా, అశోక్, రాజశేఖర్, నజీర్, మారేన్న, అంజి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.



