జీవో నెంబర్ 1 రద్దు జగన్ మూర్ఖత్వానికి చెంపపెట్టు

 

 

అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :

జీవో నెం1 రద్దు జగన్ కి చెంపపెట్టు

★ జీవో నెంబర్ ఒకటి కోర్టు రద్దు చేయడం నిరంకుశ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది అని తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు.

★ జీవో నెంబర్ ఒకటి రద్దు పై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

★ వైయస్సార్సీపి ప్రభుత్వానికి కోర్టులు ఎన్నిసార్లు చివాట్లు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదని అన్నారు.

★ ప్రజాస్వామ్యంలో జగన్ లాంటి నిరంకుశ ముఖ్యమంత్రి వస్తారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఊహించి రాజ్యాంగంలో పౌర హక్కులు భద్రపరిచారని అన్నారు.

★ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సభలకు, యువ నాయకుడు లోకేష్ పాదయాత్రకు వేలాదిమందిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, అది చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టి, ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి చీకటి జీవో నెం 1ని తెచ్చారని అన్నారు.

★ నాడు చంద్రబాబు నాయుడు తలుచుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా అని అన్నారు.

★ వైయస్సార్సీపి ప్రభుత్వం లో మాట్లాడిన వారిపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు.

★ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నినా రాబోవు ఎన్నికల్లో ప్రజలు జగన్ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

★ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని జీవో నెంబర్ ఒకటిపై ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!