నేడుగుంటూరుజిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ,తుళ్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రేపు 125 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 144 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(125) :-
అల్లూరి జిల్లా 5,అనకాపల్లి 2,బాపట్ల 21,తూర్పుగోదావరి 5,ఏలూరు 6,గుంటూరు 12,కాకినాడ 2,కోనసీమ 3,కృష్ణా 17,ఎన్టీఆర్ 17,నంద్యాల 3,పల్నాడు 24,ప్రకాశం 2,తిరుపతి 2,వైస్సార్ జిల్లాలో 7 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం కాకినాడ జిల్లా3, అనకాపల్లి2, నంద్యాలలో 1 మండలంలో వడగాల్పులు వీచాయి. డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.



