పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి
వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
(పాపన్నపేట మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17 ) ఆదివారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
సింగూర్ ప్రాజెక్ట్ ద్వారా 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం జరిగిందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పక్షంలో వరద ఉధృతి
తాకిడి ఉంటుందని ఆర్ అండ్ బి అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వర్షాలు వరదల వలన రైతులకు గాని సామాన్య ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నీటిమట్టాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


