గాంధీ-అంబేద్కర్ స్పూర్తితో మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేస్తాం-!!
జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి
(
అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి 17 )
అంబేద్కర్, గాంధీజీల ఆశయాలపై విషం చిమ్ముతున్న మతోన్మాదులను, మనువాదులను ఎదుర్కొనేందుకు జైభారత్ ఉద్యమం పనిచేస్తోందని జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి అన్నారు.
ఆదివారం జోగిపేట పట్టణం మార్కెట్ యార్డ్ లో జరిగిన గాంధీ – అంబేడ్కర్ల ఆశయాలు సాధిద్దాం! మనువాదాన్నీ, మతోన్మాదాన్నీ అంతం చేద్దాం!! పేరిట జైభారత్ సామాజిక విప్లవ రణభేరి ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మతోన్మాదం…మనువాదం అని అన్నారు. దేశాన్ని మతంపేరిట చీలకుండా ఉండేందుకు చివరివరకు పోరాటం చేసిన ఏకైక వ్యక్తి గాంధీజీ అని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, కులనిర్మూలన కోసం జీవితాంతం ప్రతి సందర్భంలోను కులాంతర వివాహాలు జరగాలని కోరుకున్న వ్యక్తి గాంధీజీ అని అన్నారు. అంబేద్కరిస్తులుగా చెప్పుకునే మేధావులు గాంధీని కులవాదిగా ప్రచారం చేయడం దుర్మార్గమని…అబద్ధమని అన్నారు. గాంధీ అంబేద్కర్ల సమన్వయం ఈ దేశానికి అవసరమని అన్నారు. ఆర్ఎస్ఎస్ కి దేశ స్వాతంత్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. బ్రిటిషర్లకు తొత్తులుగా ఉన్న సంస్థ… హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా అడ్డంగా నిలబడిన సంస్థ ఆర్ఎస్ఎస్, గాంధీ హత్యకు కారణమైన సంస్థ ఆర్ఎస్ఎస్ అని అన్నారు. నిన్న ప్రధాని మోడీగారు ఎర్రకోటపై జెండా వందనం అనంతరం చేసిన ప్రసంగంలో స్వతంత్రపోరాట వీరుల త్యాగాలను కనీసం గుర్తుచేయకుండా, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటం విచారకరం అని అన్నారు. గాంధీ, అంబేద్కర్ల పట్ల సమాజంలో ఉన్న అబద్ధాల చీకటి గోడలను బద్దలుకొట్టడానికి, వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలముందు పెట్టేందుకు జైభారత్ ఉద్యమం పనిచేస్తోందని అన్నారు.
అలాగే పూనా పాక్ట్ విషయంలో గాంధీజీ పట్ల ఎస్సీ సమాజంలో ఉన్న అపోహలను సంపూర్తిగా తొలగించేందుకు… గాంధీ, అంబేద్కర్ లు శతృవులు కారు అనడానికి రణభేరి సభలు ఒక చరిత్రగా నిలుస్తాయని అన్నారు. గాంధీ చేసిన దీక్ష రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు.. కేవలం విడి నియోజకవర్గాలకు మాత్రమే వ్యతిరేకం అని అన్నారు. అలాగే విడి నియోజక వర్గాల ద్వారా కేంద్ర అసెంబ్లీ లో దళితుల సీట్లు 71 నుంచి 148కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా రణభేరి రాష్ట్ర రీ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ ఖదిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ మనువాదానికి, మత విద్వేషానికి వ్యతిరేకంగా జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పనిచేస్తోందని అన్నారు. అంబేద్కరిస్టులుగా చెప్పుకునేవారు తమ అస్తిత్వంకోసం గాంధీ పట్ల అబద్ధాలతో కూడిన అసత్యాలను ప్రచారం ప్రతిఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి రజని మాట్లాడుతూ జాతీయోద్యమానికి వ్యతిరేకంగా… బ్రిటిషర్లకు అనుకూలంగా పనిచేసిన సంస్థ , రిజర్వేషన్లు వ్యతిరేకించే సంస్థ..ఆర్ఎస్ఎస్ అని అన్నారు. వీరి చరిత్ర బట్టబయలు చేసేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా రణభేరి పేరిట 100 బహిరంగ సభలు నిర్వహిస్తున్నమని అన్నారు.
రణభేరి రాష్ట్ర రీ ఆర్గనైజింగ్ కమిటీ కో కన్వీనర్ ఖదిజ్ఞాసి జీవన్ జోయెల్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల స్వార్థానికి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ప్రతీఘాత విష శక్తుల పదాతి దళంగా మారవద్దు అని… సామాజిక విప్లవ సమర వీరులుగా పోరాడుతామని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు ఖదిజ్ఞాసి వంశీ, జైభారత్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, రాష్ట్ర నాయకులు మాతంగి చిరంజీవి, ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి గణేష్ గల్లా, జైహో రాష్ట్ర అధ్యక్షులు ఖదిజ్ఞాసి లక్ష్మేశ్వర్, బీసీ పోరాట వేదిక రాష్ట్ర నాయకులు లావణ్య సుదీర్, కొత్త ప్రభాకర్ గౌడ్, మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆందోల్ మల్లేషం, మానవ హక్కుల సంఘం రాష్ట్ర సభ్యులు పోలే నరేందర్, బీం సోల్జర్స్ రాష్ట్ర అద్యక్షులు శేఖర్, సాహసం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పారం పద్మారావ్, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి అందోల్ నాయకులు తంపులూరి రమేష్, గంగపురం రాబర్ట్, అరేటీ విజయ్, దుదగొండ శివ కుమార్, రెండ్లపల్లి రోహిత్, పల్లే కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


