ఆదివారం జిల్లా కలెక్టర్ కే. హేమావతి నంగునూరు, కోహెడ, చిన్నకోడూరు మండలాల్లో పర్యటించినది

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 17)
ఆదివారం జిల్లా కలెక్టర్ కే. హేమావతి నంగునూరు, కోహెడ, చిన్నకోడూరు మండలాల్లో పర్యటించి లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేల వద్ద వర్షం నీరు ప్రవాహంను ఆర్ అండ్ బి డి వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ముందుగా నంగునూరు మండలంలోని అక్కినేపల్లి వద్ద మోయతుమ్మెదవాగు పై లెవెల్ బ్రిడ్జిని, బద్దిపడగ వద్ద ఊర చెరువు మత్తడి కింద రోడ్ , కోహెడ మండలం గుండారెడ్డిపల్లి వద్ద నక్కవాగు మరియు తంగళ్ళపల్లి వద్ద పిల్లివాగు వాగు, చిన్న కొండూరు మండలం సికింద్లాపూర్, ఇబ్రహీంనగర్ నగర్ల వద్ద గల స్థానిక వాగుల పై గల లోలెవల్ కాజ్వేలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఆయా వాగులలో సాధారణంగా నీటి ప్రవాహం ఉందని కానీ కంటిన్యూగా వర్షాలు పడితే లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేల్ పై నుండి వర్షం నీరు ప్రవహించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ఆయా కాజ్వేలు, బ్రిడ్జిలపై రాకపోకలను ఆపివేయాలని ఆర్ అండ్ బి డిఇ వెంకటేష్ కు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఈ రోజు పర్యటనలో ఆయా మండలాల స్థానిక అధికారులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


